Sanjay Raut : భద్రత లేకుండా ప్రజల్లోకి వెళ్లలేరు – రౌత్
వాళ్లకు ప్రజలు గుణ పాఠం చెబుతారు
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. కొత్తగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో తిరుగుబాటు ప్రకటించిన షిండే వర్గం తమ బలాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ సోమవారం స్పందించారు.
భారతీయ జనతా పార్టీ, షిండే వర్గం కలిసి ఏర్పాటు చేసిన అపవిత్ర కూటమిగా పేర్కొన్నారు. వాళ్లకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన శివసేన
పార్టీని కాదని బీజేపీతో జత కట్టారు.
కానీ ఇప్పటి వరకు వాళ్లలో ఏ ఒక్కరు సెక్యూరిటీ లేకుండా బయటకు రాలేక పోతున్నారని అన్నారు. అంటే అర్థం వాళ్లు తప్పు చేశామని భయానికి లోనవుతున్నారని ఎద్దేవా చేశారు.
కానీ శివ సైనికులు ఎప్పుడూ ఎవరికీ తల వంచరని, ఎదురొడ్డి నిలుస్తారని చెప్పారు సంజయ్ రౌత్. వాళ్లు మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు. అధికారం అన్నది ఏ ఒక్కరి స్వంతం కాదన్నది గుర్తించాలన్నారు సంజయ్ రౌత్.
కానీ గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో తిరుగుబాటు చేసిన వారంతా సింహాల్లా ఉన్నారని కానీ ఇప్పుడు కేవలం
అధికారం కోసం మాత్రమే పార్టీ మారారు తప్పా వాళ్లకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదన్నారు.
రేపొద్దున జనంలోకి పోలీసుల భద్రత లేకుండా వెళ్ల లేరన్నారు సంజయ్ రౌత్. కానీ తాము సెక్యూరిటీ ఉన్నా లేక పోయినా వెళ్లగలమని తమకు
వాళ్లకు ఉన్న తేడా అదేనన్నారు.
Also Read : వాళ్లను క్షమిస్తా ప్రతీకారం తీర్చుకోను
This (BJP & Shinde faction alliance) is a temporary arrangement, they will not be able to go to people. They were lions in Shiv Sena. Even Kasab didn't have so much security but they had when they reached Mumbai. What are you scared of?: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/Nl3JBL3wJP
— ANI (@ANI) July 4, 2022