Arvind Kejriwal : గుజరాత్ లో ఆప్ జెండా ఎగరడం ఖాయం
ధీమా వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
గుజరాత్ రాష్ట్రంలో ఆప్ భారీ స్థాయిలో విస్తరిస్తోందన్నారు. గత 27 ఏళ్ల నుంచి గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది. కానీ ఈరోజు వరకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేక పోయిందన్నారు.
ఆప్ ఒక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోతోందన్నారు. ఇది విషయాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారని చెప్పారు. తమను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేదని బీజేపీ భావిస్తోందన్నారు.
కానీ ఆపార్టీకి తెలియడం లేదు తాము చాప కింద నీళ్ల లాగా విస్తరించామని అన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . ప్రజలు ఆప్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని జోష్యం చెప్పారు.
7,000 వేల మంది ఆఫీస్ బేరర్లు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందంటూ ఆరోపించారు. బీజేపీయేతర పార్టీలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని అన్నారు.
వాళ్లకు ఎంత సేపు ప్రజల మధ్య అంతరాలు సృష్టించాలని అనుకుంటున్నారే తప్పా ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు.
కానీ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా , వత్తిళ్లకు పాల్పడినా ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ కే జనం పట్టం కట్టారని ఇది తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమన్నారు కేజ్రీవాల్.
Also Read : సిద్దూ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
AAP is expanding on a huge scale in Gujarat. People are tired of 27yrs of BJP. BJP thinks Congress can't replace them so they've developed ego. People are looking with hope towards AAP this time. Over 7000 office bearers will be taking oath today: AAP national convenor A Kejriwal pic.twitter.com/vKr5PbCzAO
— ANI (@ANI) July 3, 2022