Eknath Shinde : మ‌రాఠా సీఎం షిండే భావోద్వేగం

పార్టీ కోసం పిల్ల‌ల్ని పోగొట్టుకున్నా

Eknath Shinde : మ‌హారాష్ట్ర అసెంబ్లీలో సోమ‌వారం కొత్త‌గా సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే(Eknath Shinde ) ప్ర‌సంగించారు. తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం.

తాను ఆటో రిక్షా డ్రైవ‌ర్ గా జీవితాన్ని ప్రారంభించా. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను. 18 ఏళ్ల‌కే శివ‌సేన ప‌ట్ల ఆక‌ర్షితుడిని అయ్యా. అదే స‌మ‌యంలో పార్టీ కోసం ప‌ని చేశా.

శివ‌సేన కార్పొరేట‌ర్ గా గెలుపొందా. ఆ స‌మ‌యంలో నా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కోల్పోయాన‌ని చెప్పారు ఏక్ నాథ్ షిండే. నేను తీవ్రంగా కుంగి పోయిన స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు ఆనంద్ దిగే సాహెబ్ త‌న‌ను ఒప్పించార‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల ప‌రీక్ష‌లో ఏక్ నాథ్ షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంయుక్తంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 164 – 99 ఓట్ల తేడాతో బ‌ల‌ప‌రీక్ష‌లో గెలుపొందిన‌ట్లు స్పీక‌ర్. ప‌ది రోజుల పాటు మ‌రాఠా రాజ‌కీయాలలో క‌ల‌క‌లం రేపాయి.

నువ్వా నేనా అన్న రీతిలో స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్ల‌తో నిండి పోయాయి. చివ‌ర‌కు రెండున్నర‌ ఏళ్ల పాటు సాగిన శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ తో కూడిన మ‌హా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్ర‌భుత్వం కూలి పోయింది.

శివ‌సేన రెబ‌ల్స్ కు నాయ‌క‌త్వం వ‌హించిన షిండే తిరుగుబాటు చేశారు. ఆపై గుజ‌రాత్ నుంచి గౌహ‌తి కి మార్చారు. ఆనాటి నుంచి నేటి దాకా హీటెక్కాయ రాజ‌కీయాలు.

ఈ త‌రుణంలో బీజేపీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ స‌పోర్ట్ తో ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)  సీఎంగా కొలువు తీరారు. ఊహించ‌ని రీతిలో చివ‌రి దాకా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సీఎం అవుతార‌ని అనుకున్నారు.

కానీ మోదీ వ్యూహంలో భాగంగా బీజేపీ హై క‌మాండ్ షిండే వైపు మొగ్గింది.

Also Read : ఈడీ కాదు ‘ఏక్ నాథ్ దేవేంద్ర’ స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!