Mohammed Zubair : మహ్మద్ జుబైర్ పై కొత్త కేసు
మత పరమైన ట్వీట్లతో రెచ్చగొట్టాడు
Mohammed Zubair : కొందరి మనోభావాలు తినేలా ట్వీట్లు చేశాడనే ఆరోపణలపై ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్(Mohammed Zubair) పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చడంతో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు జుబేర్ కు 14 రోజుల కస్టడీకి అనుమతించింది.
తాజాగా మరో కొత్త కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులపై తన ట్వీట్ ద్వారా మత పరమైన మనోభావాలను రెచ్చ గొట్టారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి జుబేర్ ను సీతాపూర్ కు తీసుకు వెళ్లినట్లు సోమవారం తెలిపారు.
ప్రధానంగా జుబైర్ మహంత్ బజరంగ్ ముని, యతి నర్సింహానంద సరస్వతి, ఆనంద్ స్వరూప్ లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశాడని తెలిపారు. ఇందులో ద్వేషాన్ని వ్యాపింప చేసే వారంటూ పేర్కొన్నారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా మహ్మద్ జుబైర్(Mohammed Zubair) పై హిందూ షేర్ సేన చీఫ్ భగవాణ్ శరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. జుబైర్ పై ఐపీసీ 295ఎ, 67 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఈనెల 1న ఫిర్యాదు నమోదైంది. గత నెల 27న అరెస్ట్ చేశారు. ట్విట్టర్ పోస్టింగ్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ ట్వీట్ చేసింది జుబైర్ మార్చి 2018లో పోస్ట్ చేశారు.
ఆయన నిర్వహిస్తున్న మీడియా సంస్థకు పాకిస్తాన్ సహా విదేశాల నుంచి విరాళాలు అందాయని , కంపెనీ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. జులై 16 వరకు కస్టడీ విధించింది కోర్టు.
Also Read : యువతను నిరుద్యోగులుగా మార్చిన మోదీ