MVA Crisis : ఎంవిఏ నుంచి వైదొల‌గ‌నున్న కాంగ్రెస్

శివ‌సేన పార్టీకి కోలుకోలేని దెబ్బ

MVA Crisis : మహారాష్ట్ర‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారి పోయాయి. శివ‌సేన‌, కాంగ్రెస్, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఏర్ప‌డ్డాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండున్న‌ర ఏళ్ల పాటు పాలించింది.

చివ‌ర‌కు శివ‌సేన పార్టీలోనే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. సీనియ‌ర్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో ప్ర‌భుత్వాన్ని కూల్చారు. కొత్తగా షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కలిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మారుతున్న స‌మీక‌ర‌ణ‌ల మేర‌కు కాంగ్రెస్ పార్టీ వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. షిండే సీఎం అయ్యాక మ‌హా వికాస్ అఘాడి కూట‌మి(MVA Crisis) నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యిం తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపాయి.

ఇదిలా ఉండ‌గా విప‌క్షాల త‌రపున ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. ఈ ఎంపిక‌లో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , టీఎంసీ చీఫ్ మమ‌తా బెన‌ర్జీ, కాంగ్రెస పార్టీ చీఫ్ సోనియా గాంధీ కీల‌క పాత్ర పోషించారు.

ఈ త‌రుణంలో శివ‌సేన కూడా త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కోలుకోలేని షాక్ కు గురయ్యారు శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే,

ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్. షిండే బ‌లం నిరూపించుకున్న వెంట‌నే తాము వైదొల‌గాల‌ని అనుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్సీపీపై నిప్పులు చెరుగుతూ వ‌చ్చారు. ఆ రెండు పార్టీల మ‌ధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి.

Also Read : షిండే స‌ర్కార్ ఉండేది ఆరు నెల‌లే – ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!