Byreddy Rajasekhar Reddy : ఏం బైరెడ్డి కుశలమేనా – మోదీ
ఆప్యాయంగా పలకరించిన ప్రధాని
Byreddy Rajasekhar Reddy : రాయలసీమ రాజకీయాలలో ఆయన అద్భుతమైన నాయకుడిగా పేరొందారు. ఏ విషయన్నానైనా కుండ బద్దలు కొట్టడం ఆయనకు అలవాటు. అతడే రాయలసీమ ప్రాంత పరిరక్షణ కోసం నిరంతరం యుద్దం చేస్తున్న నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy).
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఏపీలో అగ్ర నేతగా కొనసాగుతున్నారు. ఏ విషయంపైన నైనా అనర్గలంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఇప్పటికీ కూడా ఏపీకి, రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు బైరెడ్డి.
రాయలసీమలోనే కాదు అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోను ఆయనకు ఎనలేని అభిమానులు ఉన్నారు. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆయనను అభిమానిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఆయన స్నేహ హస్తం అందిస్తారు.
తాజాగా అద్భుతమైన సన్నివేశానికి వేదికగా మారింది ఏపీ. రాష్ట్రంలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉత్సవాలలో భాగంగా ప్రధాన మంత్రి ఏపీలో పర్యటించారు.
ఈ సందర్భంగా రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కి సాదర స్వాగతం పలికారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy).
ఈ సందర్భంగా మోదీ చాలా సేపు బైరెడ్డితో మాట్లాడారు. ఏం బైరెడ్డి అంతా కుశలమేనా అని ఆప్యాయంగా పలకరించారు. అంతే కాదు చాలా సేపు బైరెడ్డి చేతుల్ని పట్టుకుని నవ్వారు.
ఎలా ఉన్నావంటూ అడిగారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కొంత సేపు ఆశ్చర్యానికి లోనయ్యారు.
Also Read : మోదీజీ ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్