Ashok Chavan : కూట‌మితోనే ప‌య‌నం విడిపోవ‌డం అబ‌ద్దం

మ‌హా వికాస్ అఘాడీని వీడడ‌డం లేదు

Ashok Chavan : కాంగ్రెస్, శివ‌సేన‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడి కూట‌మిగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం కుప్ప కూలి పోయింది. రెండున్న‌ర ఏళ్ల పాటు సాగింది.

శివ‌సేన కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు తిరుగుబాటు జెండా ఎగర వేయ‌డ‌మే కాదు ఏకంగా మ‌రాఠా సీఎంగా కాలువు తీరారు. అసెంబ్లీలో నిర్వ‌హించిన బ‌ల‌ప‌రీక్ష‌లో సైతం నెగ్గి త‌న స‌త్తా చాటుకున్నారు.

ఈ త‌రుణంలో ఎంవీఏ కూట‌మి నుంచి తాము త‌ప్పుకుంటున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ చ‌వాన్(Ashok Chavan). ఈ సంద‌ర్భంగా అదంతా ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న నిరాధార‌మైన ఆరోప‌ణ‌లుగా కొట్టి పారేశారు.

అంతే కాకుండా తాము క‌లిసే ముందుకు వెళ‌తామ‌ని, ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం కూలి పోయినంత మాత్రాన ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ మాత్రం తగ్గ‌ద‌న్నారు.

కావాల‌ని దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని అశోక్ చ‌వాన్(Ashok Chavan) ఆరోపించారు.

గ‌త కొంత కాలం నుంచి త‌మ పార్టీల‌ను అప‌విత్ర పొత్తంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి వాటిని మ‌రిచి పోయింద‌ని మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో స్పీక‌ర్ అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఆరోపించారు అశోక్ చ‌వాన్. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భ‌గా కేవ‌లం 2 నిమిసాలు ఆల‌స్యంగా వ‌చ్చినా వ‌చ్చేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.

ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ స‌త్తా ఏమిటో చూపిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!