YS Sharmila : శ్రీకాంతాచారి తల్లికి ఏం చేసినవో చెప్పు
బిడ్డ ఓడి పోతే ఎమ్మెల్సీ ఇచ్చినవ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు 1500 కిలోమీటర్లకు పైగా సాగింది యాత్ర. ఈ సందర్భంగా షర్మిలకు జనం భారీగానే ఆదరిస్తున్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై , ఆయన పాలనపై నిప్పులు చెరిగారు. తన బిడ్డ కల్వకుంట్ల కవిత ఓడి పోతే వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
మరి తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంతాచారి బలిదానిని ఎలా మరిచి పోయావని ప్రశ్నించారు. బిడ్డను కోల్పోయిన తల్లికి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చే అవకాశం ఉన్నా ఈరోజు వరకు ఒక్క అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
మాయ మాటలు చెప్పడంలో సీఎంను మించిన వారు లేరన్నారు షర్మిల. కన్న బిడ్డకు ఒక న్యాయం, బిడ్డను కోల్పోయిన తల్లికి ఇంకో న్యాయమా అంటూ నిలదీశారు.
వాడుకోవడం వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కుల వృత్తులను అవమానించడం దారుణమన్నారు.
కల్వకుంట్ల కుటుంబంలో అన్ని ఉద్యోగాలు పొందారని ఈరోజు వరకు నోటిఫికేషన్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పటి వరకు ఒక్క పోస్టు అయినా భర్తీ చేయక పోవడం అవమానించడమేనని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
అవినీతి, అక్రమాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారి పోయిందంటూ ఆరోపించారు షర్మిల. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అంతా దోచుకునుడే తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు.
Also Read : పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం