YS Jagan : ఏపీలో దౌడు తీస్తున్న పారిశ్రామిక రంగం
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుఉ చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందన్నారు. 11.74 శాతం వృద్ది రేటును సాధించిందన్నారు.
ఉపాధి కల్పన, స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో తమ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. దేశంలోనే ఈఓడీబీ చార్టుల్లో టాప్ లో ఏపీ నిలిచిందని వెల్లడించారు.
కానీ ప్రతిపక్షం మాత్రం ఈ వివరాలను పరిగణలోకి తీసుకోకుండానే అసత్య ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు సీఎం. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
గతంలో కొలువు తీరిన ప్రభుత్వం తమ స్వలాభం కోసం ప్రయత్నాలు చేసిందని, వారి తాబేదార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.
కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం ఏపీ 17 రాష్ట్రాలతో పోటీ పడిందని స్పష్టం చేశారు ఏపీ సీఎం(YS Jagan). కాకినాడలో 35,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు.
ఇక రూ. 1,000 కోట్ల ప్రాజెక్టు ఓకే అయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ వస్తాయని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి. ప్రాజెక్టును దక్కించు కోలేక తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని తన వారితో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 99 పరిశ్రమలు రూ. 46,280 కోట్ల పెట్టుబడితో 62,541 మందికి జాబ్స్ కల్పించామన్నారు.
అంతే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం హెచ్ పీ సీఎల్ , బీఈఎల్, సీపీఎస్ యూ లాంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan).
Also Read : ఢిల్లీ స్కామ్ లో ప్రమేయం అబద్దం