Mahua Moitra : మహూవా మోయిత్రాపై కేసు నమోదు
కలి చిత్రంపై వివాదాస్పద ట్వీట్
Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రాపై కేసు నమోదైంది. కాళీ దేవిపై ఆమె వివాదాస్పద కామెంట్స్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మహూవా మోయిత్రా ఖండించారు.
తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కొందరు కావాలని తనను ట్రోల్ చేశారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.
మత పరమైన భావాలను దెబ్బ తీసేలా ఉందంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు జితేన్ ఛటర్జీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఎంపీ మహూవా మోయిత్రాపై(Mahua Moitra) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు మహూవా. నేను కూడా కాళీదేవి ఆరాధకురాలినే. నేను దేనికీ భయపడే వ్యక్తిని కాను.
మ గూండాలు, మీ పోలీసులు చేస్తున్న కేసులకు తాను వెనక్కి తగ్గేది లేదన్నారు. సత్యానికి బ్యాకప్ దళాలు అవసరం లేదని స్పష్టం చేశారు మహూవా మోయిత్రా.
దేవత సిగరెట్ తాగుతున్నట్లు చిత్ర నిర్మాత లీనా మణికమేకలై షేర్ చేసింది ఫిల్మ్ పోస్టర్. దీనికి మద్దతుగా తాను కామెంట్స్ చేశారంటూ తనను ట్రోల్ చేయడం మంచి పద్దతి కాదన్నారు ఎంపీ.
ఇదిలా ఉండగా హిందూ దేవుళ్లను అవమానించడం పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకీ అలవాటుగా మారిందన్నారు బీజేపీ నేతలు.
ఇదిలా ఉండగా టీఎంసీ అధికారికంగా ఖండించింది ఎంపీ వ్యాఖ్యలను. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అని పార్టీకి సంబంధించినవి కావని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
Also Read : ఏసీబీపై సీరియస్ జడ్జికి వార్నింగ్
The comments made by @MahuaMoitra at the #IndiaTodayConclaveEast2022 and her views expressed on Goddess Kali have been made in her personal capacity and are NOT ENDORSED BY THE PARTY in ANY MANNER OR FORM.
All India Trinamool Congress strongly condemns such comments.
— All India Trinamool Congress (@AITCofficial) July 5, 2022