RS Praveen Kumar : సీఎం కేసీఆర్ పై కేసు పెట్టాలి – ఆర్ఎస్పీ
విద్యా వ్యవస్థను భ్రష్టు పెట్టిన ఘనత ఆయనదే
RS Praveen Kumar : బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. పూర్తిగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
గత కొన్నేళ్లుగా యూనివర్శిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాలలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా నియమించిన దాఖలాలు లేవన్నారు. గత కొంత కాలంగా విశ్వ విద్యాలయాలలో అధ్యాపకుల నియామకానికై శాంతి యుతంగా పోరాడుతున్న ప్రొఫెసర్ కాశీంతో పాటు 20 మంది ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
నిజానికి తెలంగాణ విద్యా వ్యవస్థను నాశనం చేసి మద్యాన్ని చకవగా పంపిణీ చేసి ఒక తరాన్ని నాశనం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని బీఎస్పీ చీఫ్ డిమాండ్ చేశారు. మరో వైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకు పోయాయని ఇప్పటి వరకు వాటిపై ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవన్నారు.
నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు ఆర్ఎస్పీ. సర్పంచ్ లు పోరాడాలని కానీ ఆత్మహత్యా యత్నాలకు ప్రయత్నం చేయొద్దని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : నెట్టింట్లో సీఎం కేసీఆర్ వైరల్