CM Yogi With Cat : ఒడిలో మార్జాలం యోగి సంతోషం

జంతువులు కూడా ప్రేమిస్తాం

CM Yogi With Cat : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ఉన్న ఏకైక నాయ‌కుడు , ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ చుక్క‌లు చూపిస్తున్నాడు. ఏకంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆయ‌నే అన్నీ అయ్యాడు. రెండోసారి అధికారంలోకి తీసుకు వ‌చ్చాడు.

ఈ ఘ‌న‌త అంతా సీఎం యోగికే ద‌క్కుతుంది. అంతే కాదు స‌మాజ్ వాది, బీఎస్పీ పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. అంతే కాదు యోగి ఆదిత్యానాథ్ బ్ర‌హ్మ‌చారిగా ఉన్నారు. ఆయ‌న గ‌తంలో పార్టీలో చేర‌క ముందు నుంచీ ఆశ్ర‌మంలో కొలువు తీరాడు. ఆయ‌న‌కు జంతువులంటే ఎంతో అభిమానం. వాటితో ఆడుకుంటారు.

అంతే కాదు ఏ కాస్తా స‌మ‌యం చిక్కినా పిల్లులు, శున‌కాల‌తో ఆడుకుంటారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi With Cat)  ఒడిలో మార్జాలం (పిల్లి) కూర్చోవ‌డం, ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. గోవు సేవ‌కుడిగా పేరు తెచ్చున్నాడు యోగి ఆదిత్యానాథ్. జంతు ప్రేమికుడిగా పేరొందారు. ఆయ‌న ఎప్ప‌టి లాగానే సంప్ర‌దాయ కాషాయ వ‌స్త్రాన్ని ధ‌రించాడు. ప‌క్షులు, జంతువులు కూడా త‌న‌కు స్నేహితులేన‌ని పేర్కొన్నాడు సీఎం యోగి. అవి శ‌త్రువులు ఎవ‌రో స్నేహితులు ఎవ‌రో కూడా గుర్తించ గ‌ల‌వ‌ని స్ప‌ష్టం చేశాడు యోగి ఆదిత్యానాథ్.

ప్ర‌స్తుతం యోగి షేర్ చేసిన పిల్లితో క‌లిసి ఉన్న ఫోటోను వేలాది మంది లైక్ చేస్తున్నారు. అంతే కాదు పాల‌న‌లోనే కాదు జంతువుల‌కు ప్రేమ‌ను పంచ‌డంలో కూడా షెహ‌న్ షా అని నిరూపించుకున్నారు.

Also Read : పంత్ ను ప‌రామ‌ర్శించిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!