Punjab CM : చండీగఢ్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ
ప్రకటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Punjab CM : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది పంజాబ్ లోని మొహాలీ చండీగఢ్ యూనివర్శటీలో చోటు చేసుకున్న ఆందోళన. ఓ స్టూడెంట్ యూనివర్శిటీకి చెందిన ఇతర బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడం , ఆ తర్వాత వాటిని తన బాయ్ ఫ్రెండ్ కు షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
సదరు బాయ్ ఫ్రెండ్ వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడంతో మిగతా స్టూడెంట్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు నిన్న రాత్రి నుంచి చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఘటనకు బాధ్యురాలైన విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘటనపై స్పందించారు.
విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. విద్యా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులను ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదని పేర్కొన్నారు.
మొత్తం వ్యవహారం కలకలం రేగడం, చర్చకు దారి తీయడంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ మేరకు చత్తీసగఢ్ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎవరూ తొందరపపాటుకు గురి కావద్దని సూచించారు. మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్.
ఆడపిల్లల పట్ల ఎవరు చులకనగా చూసినా తాము ఊరుకోబోమంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అమ్మాయిలు ప్రదర్శించిన ధైర్యాన్ని కొనియాడారు సీఎం.
Also Read : కాసినోలు తెరవడంపై పునరాలోచన – సీఎం