TTD Security : తిరుమల భద్రతపై అలర్ట్
హరీష్ కుమార్ గుప్తా సమీక్ష
TTD Security : పుణ్య క్షేత్రమైన తిరుమలలో భద్రతా(TTD Security) పరమైన అంశాలపై సమీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. కరోనా అనంతరం తిరుమలకు భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. వాహనాల రద్దీ కూడా అంతకంతకూ పెరుగుతోంది. రోజుకు వేలాది మంది తరలి వస్తున్నారు. ఇదే సమయంలో భద్రత అన్నది అత్యంత ముఖ్యంగా మారింది. ఇప్పటికే తిరుమల చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజాగా నిర్వహించిన సమీక్షలో భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం, టెక్నాలజీని వాడుకోవడం, భక్తులకు ఇబ్బందులు కలగకుండా గస్తీని ఏర్పాటు చేయడం తదితర అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. రద్దీ పెరుగుతుండడంతో సెక్యూరిటీని ఎలా పెంచాలన్న దానిపైనే ఎక్కువ గా ఫోకస్ పెట్టారు హరీష్ కుమార్ గుప్తా. అంతకు ముందు ఈ కీలక సమావేశంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ , ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇంకా సెక్యూరిటీని మరింత పటిష్టం చేయాల్సిన ప్రదేశాల గురించి ప్రస్తావించారు. అనంతరం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి, ఓఎస్డీ శశి ధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో , సెక్యూరిటీ వింగ్ , ఆక్టోపస్ , ఎస్పీఎఫ్ , జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జేఈవో వీరబ్రహ్మం టీటీడీ తరపున హాజరయ్యారు.
Also Read : Chandrababu Naidu