CJI Chandrachud : టెండూల్కర్ ను ప్రస్తావించిన సీజేఐ
న్యాయవాదిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు విచారణ సందర్భంగా వచ్చేటప్పుడు న్యాయవాదులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతే కాదు మనం ఎంత సమర్థులమైనా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఉండాలని పేర్కొన్నారు.
అలా లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా లేదా సామర్థ్యం కలిగి ఉన్నా వేస్ట్ అని కుండ బద్దలు కొట్టారు. ఇదే సమయంలో బ్యాట్ లేకుండా సచిన్ టెండూల్కర్ ఎలా పరుగులు చేస్తాడని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఈజేఐ చంద్రచూడ్(CJI Chandrachud). న్యాయవాదిని ఉద్దేశించి సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కీలకంగా మారాయి. బ్రీఫ్ లేని న్యాయవాది బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ లాగా ఉంటాడని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవతలి వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుందని స్పష్టం చేశారు. కేసు ఫైల్ లేకుండా తన ముందు హాజరు కావాలని ఇవాళ ఒక న్యాయవాదిని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ఒకరు తన కేసు ఫైల్ లేకుండా తమ ముందు హాజరు కావడాన్ని గమనించారు. వెంటనే అతడిని తప్పు పట్టారు. మీరు అన్నీ ఉన్నా కేసుకు సంబంధించిన ఫైల్ లేకుండా వస్తే ఎలా అని ప్రశ్నించారు జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ హిమా కోహ్లీ. న్యాయ స్థానంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంటుందని, ఈ తరుణంలో ప్రస్తుతం లైవ్ టెలికాస్ట్ అవుతోందని ఆ మాత్రం గుర్తించక పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : కీవీస్ భారత్ టి20 మ్యాచ్ వర్షార్పణం
