Elon Musk : న్యూ ఇయ‌ర్ లో స‌రికొత్త‌గా ట్విట్ట‌ర్

ప్ర‌క‌టించిన బాస్ ఎలోన్ మ‌స్క్

Elon Musk : కొత్త సంవ‌త్స‌రం 2023లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటాయ‌ని ప్ర‌క‌టించారు టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ చీఫ్ ఎలోన్ మ‌స్క్(Elon Musk). ఇప్ప‌టికే కాస్ట్ క‌టింగ్ పేరుతో 9 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించారు. చివ‌ర‌కు ఎంప్లాయిస్ బిక్కు బిక్కుమంటూ బ‌తుకు జీవుడా అంటూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని విధులు నిర్వ‌హిస్తున్నారు.

కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. బ్లూ టిక్ విష‌యంలో కీలక ప్ర‌క‌ట‌న చేశాడు ఎలోన్ మ‌స్క్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా, స‌ర‌దాగా ఉండేలా ట్విట్ట‌ర్ ను తీర్చి దిద్దాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు ఎలోన్ మ‌స్క్. మ‌రో వైపు ట్విట్ట‌ర్ ఆఫీసులో చాలా మందిని తొల‌గించాక కాప‌లాదారులు లేకుండా పోయారు.

టాయిలెట్లు కూడా శుభ్రం చేసే వారు క‌రువ‌య్యారు. దీంతో ట్విట్ట‌ర్ లో ప‌ని చేసే ఉద్యోగులు స్వంతంగా టాయిలెట్ శుభ్రం చేసుకునేందుకు పేప‌ర్ల‌ను తెచ్చుకుంటున్నార‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థ‌నం వెల్ల‌డించింది. ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు ఎలోన్ మ‌స్క్(Elon Musk).

శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న విష‌యాలు త్వ‌ర‌లో రాబోతున్నాయ‌ని తెలిపాడు. జ‌న‌వ‌రిలో సంజ్ఞ ఆధారిత నావిగేష‌న్ రాబోతోంద‌ని ప్ర‌క‌టించాడు. అయితే ఎప్పుడు ప్ర‌సారం అవుతుంద‌నే దానిపై ఇంకా తేదీని వెల్ల‌డించ‌లేదు. అత్యాధునిక టెక్నాల‌జీని వాడుతున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు ఎలోన్ మ‌స్క్.

ఇటీవ‌ల ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసేందుకు ఉప‌యోగించే ప‌రిక‌రాన్ని చూపించే ట్యాగ్ ను తీసి వేసింది. అంతే కాకుండా కీల‌క మార్పు కూడా చేసింది. ట్వీట్ల‌పై వీక్ష‌కులు ఎంత మంది ఉన్నార‌నేది కూడా చూపిస్తుంది.

Also Read : టాయిలెట్ పేప‌ర్ల‌తో ట్విట్ట‌ర్ ఆఫీసుకు

Leave A Reply

Your Email Id will not be published!