Syed Hafeez Forbes List : ఫోర్బ్స్ జాబితాలో హఫీజ్ కు చోటు
టాప్ 100 డిజిటల్ స్టార్స్ లిస్టు
Syed Hafeez Forbes List : ప్రపంచంలో టాప్ బిజినెస్ పత్రికగా పేరొందిన ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ పేరుతో లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు వాడైన టెక్ కంటెంట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్(Syed Hafeez Forbes List) క్ చోటు దక్కింది.
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇతడి స్వస్థలం. టెక్నాలజీపై కోరికతో 2011 నుంచి తెలుగు టెక్ ట్యూబ్స్ పేరుతో యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు.
కొత్తగా రావాలని అనుకునే వారికి, టెక్నాలజీ పరంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి, ఎలాంటి మొబైల్స్ అయితే బెటర్ , ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దానిపై కూడా ఇందులో వివరిస్తూ ఉంటాడు.
రోజు రోజుకు మనోడి చానల్ కు ఆదరణ పెరగడం ఆదాయం రావడం జరుగుతోంది. అందుబాటులో ఉన్న సాంకేతిను ఎలా ఉపయోగించు కోవాలి, డబ్బులు నిజాయితీగా ఎలా సంపాదించాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు హఫీజ్(Syed Hafeez).
ఇతడికి ఫోర్బ్స్ ఇచ్చిన స్కోర్ 8.89 . 16 లక్షల మంది సబ్ స్క్కైబర్లు ఉన్నారు. నెలకు 2 లక్షల ఆదాయం సమకూరుతోంది అతడికి.
దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీఈ, ఫ్యాషన్ , బిజినెస్ , ఫిట్ నెస్ , ఫుడ్ , టెక్నాలజీ, ట్రావెల్ , సోషల్ వర్క్ ఇలా తొమ్మిది విభాగాలను ప్రామాణికంగా తీసుకుంది.
ఆయా రంగాలలో యూజర్లను ఆకట్టుకుంటున్న వంద మందిని ఎంపిక చేసింది ఫోర్బ్స్ పత్రిక. హఫీజ్ కు 32వ స్థానం లభించింది. తెలుగు యూట్యూబర్లలో చాలా మంది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అమ్మ చేతి వంట పేరుతో భార్గవి మోస్ట్ పాపులర్ గా ఉన్నారు.
Also Read : భారత్ లో 72,993 స్టార్టప్ ల హవా