Yashwant Sinha : రాష్ట్ర‌ప‌తి అంటే ర‌బ్బ‌ర్ స్టాంప్ కాదు

విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సిన్హా

Yashwant Sinha : విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న య‌శ్వంత్ సిన్హా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం య‌శ్వంత్ సిన్హా ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అన్న‌ది అత్యంత గొప్ప‌ద‌ని, కానీ అది ఎన్న‌డూ ర‌బ్బ‌ర్ స్టాంప్ కారాదంటూ పేర్కొన్నారు. భార‌త రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించ‌డం అన్న‌ది త‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌న్నారు.

ఇందు కోసం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని, కృషి చేస్తాన‌ని చెప్పారు సిన్హా. ఏం జ‌రిగినా రాజ్యాంగ విలువలు లేని ప్ర‌భుత్వానికి తాను రబ్బ‌ర్ స్టాంప్ ప్రెసిడెంట్ గా మాత్రం ఉండ‌న‌ని స్ప‌ష్టం చేశారు య‌శ్వంత్ సిన్హా. ఇది నేను చేస్తున్న వాగ్ధాన‌మ‌ని పేర్కొన్నారు.

తోటి భార‌తీయులంతా దీనిని గ్ర‌హించాల‌ని కోరారు. విలువ‌ల‌కు, ధ‌ర్మానికి ప్ర‌తీకగా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఉండాల‌న్నారు. ఆయ‌న ప‌రోక్షంగా మోదీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

య‌శ్వంత్ సిన్హా ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ త‌ర‌పున బ‌రిలో ఉన్న ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్ముతో పోటీ ప‌డ‌నున్నారు.

ఈనెల 18న రాష్ట్ర‌ప‌తి వ‌ద‌వి కోసం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 21న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టిస్తుంది.

ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించాల‌ని సూచించింది బీజేపీ నాయ‌క‌త్వం. కానీ విప‌క్షాలు ఒప్పుకోలేదు. దీంతో పోటీ అనివార్య‌మైంది. ఓ వైపు బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే ఎన్నిక ఏక‌ప‌క్షంగా ఉండ‌నుంది.

ఇదిలా ఉండ‌గా య‌శ్వంత్ సిన్హా(Yashwant Sinha) ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read : వాహ‌న‌దారుల‌కు షిండే ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!