Soyam Bapurao : సోయం బాపురావుకు అరుదైన చాన్స్

కేంద్రం నుంచి రావాలంటూ ఫోన్

Soyam Bapurao : ఆదిలాబాద్ కు చెందిన ఆదివాసీ బిడ్డ సోయం బాపూరావు(Soyam Bapurao)కు అరుదైన చాన్స్ ల‌భించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేసింది.

ఇందుకు సంబంధించి ముర్ము ఈనెల 24న అధికారికంగా న్యూఢిల్లీలో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును ఎంపిక చేసింది కేంద్ర స‌ర్కార్.

ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ‌వాల్ తానే సోయం బాపూరావుకు(Soyam Bapurao) ఫోన్ చేశారు.

భార‌త రాష్ట్ర‌ప‌తి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా మిమ్మ‌ల్ని ఎంపిక చేశామ‌ని ఈ అరుదైన అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు మేఘ‌వాల్.

ద్రౌప‌ది ముర్ము తో పాటు సోయం బాపు రావు కూడా ఇదే సామాజిక ఆదివాసీ వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం విశేషం. ఎవ‌రు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేసినా దాఖ‌లు చేసే స‌మ‌యంలో త‌న‌ను ప్ర‌తిపాదించే వారు ఉండాల్సిందే.

అందుకే ఈ చాన్స్ ద‌క్కింది సోయం బాపురావుకు. ఇక ఆదిలాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన బాపూరావు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం అజ్జ‌ర్ వ‌జ్జ‌ర్ గ్రామానికి చెందిన వారు.

ఆయ‌న 28 ఏప్రిల్ 1969లో పుట్టారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌భ్యునిగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆదిలాబాద్ నుండి ఎంపీగా ఎన్నిక‌య్యారు.

Also Read : ‘శివ’ సైనికుల కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!