CM Nitish Kumar : ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టాలి – నితీశ్
కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీహార్ సీఎం
CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. దానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. సమాధాన్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
త్వరలో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. తాము ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు సీఎం.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేటి దాకా నిత్యం ప్రజల సమస్యలు వింటున్నానని చెప్పారు నితీశ్ కుమార్(CM Nitish Kumar). ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారనే దానిపై తెలుసు కునేందుకే తాను సమాధాన్ యాత్రకు శ్రీకారం చుట్టానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపట్టిన యాత్రకు భారీ ఎత్తున స్పందన లభిస్తోందని పేర్కొన్నారు సీఎం.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్ పత్రాన్ని ఖరారు చేసే పనిలో మోదీ ప్రభుత్వం నిమగ్నమై ఉంది.
Also Read : సమాధాన్ యాత్ర పేరుతో నితీశ్ మోసం