Chinese Spy Ship : భారత్ కు షాక్ చైనా నౌకకు లైన్ క్లియర్
అనుమతి ఇచ్చిన శ్రీలంక ప్రభుత్వం
Chinese Spy Ship : భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక సర్కార్ పట్టించు కోలేదు. కష్ట కాలంలో సాయం చేసినా పరిగణలోకి తీసుకోలేదు. సరిహద్దులో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు దాసోహం అంది శ్రీలంక.
చైనా గూఢచారి నౌక లంక(Chinese Spy Ship) ఓడరేవు వద్ద డాక్ చేసేందుకు క్లియర్ చేయడం మరింత ఆందోళనకు దారి తీసింది. యువాన్ వాంగ్ నౌక ఈనెల ప్రారంభంలో శ్రీలంక చైనీస్ నడుపుతున్న హంబన్ టోటా పోర్డ్ కు కాల్ చేయాల్సి ఉంది.
కాగా కొలంబో బీజింగ్ సందర్శనను నిరవధికంగా వాయిదా వేయమని కోరింది. ఇదిలా ఉండగా న్యూఢిల్లీ లోని సైనిక స్థావరాలపై గూఢచర్యం చేయొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
వివాదాస్పద చైనా పరిశోధన నౌకను ద్వీపాన్ని సందర్శించేందుకు శ్రీలంక ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసినట్లు వెల్లడించారు. చావు కబురు చల్లగా చెప్పారు.
యువాన్ వాంగ్ -5 అంతర్జాతీయ షిప్పింగ్ , అనలిటిక్స్ సైట్ లతో పరిశోధన, సర్వే నౌకగా భావిస్తున్నారు. కాగా దీనిని డ్యూయల్ యూజ్ గౌఢచారి నౌకగా ఇప్పటికే ఆరోపించింది.
శ్రీలంక ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక్కడ మరో విషయం చెప్పు కోవాల్సింది ఏమిటంటే చైనా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసింది శ్రీలంకకు.
ఏ మాత్రం కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో చేసిన అప్పుల్ని తీర్చే స్థితిలో లేదు శ్రీలంక. అందుకే చైనా రుణాలను సాకుగా తీసుకుని రాజకీయాలు చేస్తోంది.
కాగా ఈ నౌకను అడ్డం పెట్టుకుని భారత్ పై నిఘాను ముమ్మరం చేయాలని ప్లాన్ చేసింది చైనా.
Also Read : మహిళల నిరసన..తాలిబన్ల కన్నెర్ర