SS Sukhu : దైవభూమిలో స్థిరమైన సర్కార్ – సుఖు
ఎవరూ పార్టీని వీడరన్న పీసీసీ చీఫ్
SS Sukhu : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు 68 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.
అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. దీంతో ఎవరు సీఎంగా ఎంపికవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
దీనికి పార్టీ ఇన్ చార్జ్ రాజీవ్ శుక్లా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ మద్దతు దారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో పార్టీ హైకమాండ్ ప్రియాంక గాంధీకి సీఎంను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ , ఎమ్మెల్యే సుఖ్విందర్ సింగ్ సుఖు(SS Sukhu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, ఏ ఒక్కరు తమ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ చేసే కొనుగోలు యత్నాలకు తమ వారు లొంగి పోరని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేలు కావాలని కానీ తమకు అంతకంటే ఎక్కువ 5 మంది ఎమ్మెల్యేల బలంగా ఉందన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం తమకే మద్దతు ఇస్తామని ప్రకటించారని చెప్పారు సుఖు.
Also Read : కమల వికాసం భూపేంద్రుడికే పట్టం