Parliament Attack : పార్ల‌మెంట్ దాడిలో అమ‌రుల‌కు నివాళి

వారి త్యాగం దేశం మ‌రువ‌లేదన్న ప్ర‌ధాని

Parliament Attack : 2001లో పార్ల‌మెంట్ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు. స‌రిగ్గా ఇదే రోజు డిసెంబ‌ర్ 13, 2001న ఐదుగురు సాయుధులైన ఉగ్ర‌వాదులు పార్ల‌మెంట్(Parliament Attack) కాంప్లెక్స్ లోకి చొర‌బ‌డ్డారు.

విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులకు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ దాడిలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఒక పౌరుడు స‌హా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి సేవ‌, ధైర్య సాహ‌సాలు, త్యాగాల‌ను ఎప్ప‌టికీ మ‌రిచి పోలేమ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా విలువైన ప్రాణ న‌ష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

2001లో ఇవాళ జ‌రిగిన ఉగ్ర‌వాద దాడికి వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్ ను ర‌క్షించే స‌మ‌యంలో త‌మ ప్రాణాల‌ను అర్పించిన వీరుల‌కు త‌ల వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని పేర్కొన్నారు రాష్ట్ర‌ప‌తి. వారి ధైర్యం, అత్యున్న‌త త్యాగం ఎల్ల‌ప్ప‌టికీ నిలిచి ఉంటుంద‌న్నారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజ‌న్ చౌద‌రి, ఉపాధ్య‌క్షుడు , రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ , లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా స‌హా ప‌లువురు నాయ‌కులు నివాళులు అర్పించారు. 21 ఏళ్ల త‌ర్వాత జ‌వాన్ల‌కు నివాళులు అర్పించారు .

లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా పార్ల‌మెంట్ సెష‌న్ ను ప్రారంభిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ 13 మ‌న‌కు చీక‌టి రోజు. ప్ర‌జాస్వామ్య చిహ్నంపై దాడి జ‌రిగింది. కానీ మ‌నం ఓడి పోలేదు. అయితే వీరుల‌ను కోల్పోయామ‌ని పేర్కొన్నారు.

స్వ‌తంత్ర భార‌త దేశ చ‌రిత్ర‌లో ఈ రోజు అత్యంత భయంక‌ర‌మైన రోజుగా గుర్తుండి పోతుంద‌న్నారు రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్.

Also Read : డ‌బ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా జెరెమీ ఫ‌ర్రార్

Leave A Reply

Your Email Id will not be published!