PM Modi : బీజేపీకి ఓటు అభివృద్దికి మలుపు – మోదీ
హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ మాదే పవర్
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు అభివృద్ధికి మలుపుగా మారుతుందన్నారు. బీజేపీ స్థిరత్వం, సేవ, సమానత్వం కోసం పోరాడుతుందన్నారు. ఆ దిశగానే తాము పాలన సాగిస్తామన్నారు.
స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ది అన్నది సాధ్యమవుతుందన్నారు మోదీ(PM Modi) . ఈ విషయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ప్రధాన మంత్రి. రాబోయే 25 సంవత్సరాలలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గతంలో ఏలిన పాలకులు తమ కోసం మాత్రమే చూసుకున్నారని కానీ తాము వచ్చాక అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూర్చేలా పాలన సాగిస్తున్నట్లు చెప్పారు నరేంద్ర మోదీ. సత్వర అభివృద్ది సుస్థిర ప్రభుత్వం అవసరమని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారంటూ స్పష్టం చేశారు.
ఈ మేరకు శనివారం ఆయన ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈసారి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ప్రత్యేకం. ఎందుకంటే నవంబర్ 12న పోలైన ఓట్లు రాబోయే ఐదేళ్లకు మాత్రమే కాదని మరో 25 ఏళ్ల పాటు అభివృద్దికి సంకేతంగా నిలుస్తుందన్నారు ప్రధాన మంత్రి.
మండి జిల్లా లోని సుందర్ నగర్ లో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి ఇక్కడి ప్రాధాన్యత గురించి చెప్పారు. సీఎం జైరామ్ ఠాకూర్ సొంత జిల్లా ఇది.
తనకు పూర్తి విశ్వాసం, నమ్మకం హిమాచల్ ప్రదేశ్ వాసులపై ఉందన్నారు నరేంద్ర మోదీ. మరోసారి పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : కాంగ్రెస్ కు షాక్ హిమాన్షు వ్యాస్ గుడ్ బై