Mallikarjun Kharge : ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే బావుండేది – ఖ‌ర్గే

ఇదే విష‌యాన్ని శ‌శి థ‌రూర్ కు చెప్పా

Mallikarjun Kharge :  కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో ఉన్న ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో ఇద్ద‌రే మిగిలారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఖర్గే నాన్ గాంధీ ఫ్యామిలీ త‌ర‌పు నుంచి ఎంపీ శ‌శి థ‌రూర్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యేందుకు పావులు క‌దుపుతున్నారు.

సోనియా గాంధీ కుటుంబ ఆశీస్సులు ఖ‌ర్గేకు ఎక్కువ‌గా ఉన్నాయి. కానీ శ‌శి థ‌రూర్ సైతం మంచి ఫాలోయింగ్ క‌లిగి ఉండ‌డం విశేషం. దీంతో ఖ‌ర్గే వ‌ర్సెస్ థ‌రూర్ మ‌ధ్య పోటీ మ‌రింత కీల‌కంగా మారింది. ఇద్ద‌రు నాయ‌కులు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. థ‌రూర్ నాగ్ పూర్ నుంచి ప్రారంభించారు.

ఇదే స‌మ‌యంలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాను ఎన్నో ప‌ద‌వులు ఇప్ప‌టికే నిర్వ‌హించాన‌ని ఏకగ్రీవంగా పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటే బావుండేద‌ని ముందే త‌న‌కు చెప్పాన‌ని అన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). కానీ శ‌శి థ‌రూర్ వినిపించు కోలేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా పార్టీ ఎప్ప‌టి లాగా ఉండాల‌ని అనుకుంటే ఖ‌ర్గేను గెలిపించాల‌ని లేదా పార్టీలో మార్పులు, సంస్క‌ర‌ణ‌లు కావాల‌ని అనుకుంటే త‌న‌కు ఓటు వేయాల‌ని స్ప‌ష్టం చేశారు శ‌శి థ‌రూర్.

మ‌రో వైపు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే దీనిపై స్పందించారు. తాను ద‌ళిత నాయ‌కుడిగా కాకుండా కాంగ్రెస్ నాయ‌కుడిగా పోటీ చేస్తున్న‌ట్లు చెప్పారు. తాను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని, కేవ‌లం పార్టీ కోస‌మే అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న‌ట్లు చెప్పారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

Also Read : తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు ద్రోహం చేయ‌లేను

Leave A Reply

Your Email Id will not be published!