Aadhaar Services : ఇక నుంచి ఇంటి వద్దకే ఆధార్
యూఐడీఐఏ సంచలన నిర్ణయం
Aadhaar Services : ఈ దేశంలో బతకాలంటే పౌరసత్వం లేక పోయినా పర్వాలేదు. కానీ బతికి ఉన్నామని చెప్పుకునేందుకు మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.
ప్రతి దానికి, ప్రతి పనికి , ప్రతి లావాదేవీకి ఆధార్ కార్డు (వ్యక్తిగత గుర్తింపు కార్డు ) ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలోళ్ల దాకా ఆధార్ కావాల్సిందే.
లేక పోతే ప్రయాణం చేయలేం. బతికి బట్టకట్టలేం. ఈ దేశంలో ఆధార్(Aadhaar Services) పొందాలంటే నానా తంటాలు. ఆఫీసులకు వెళ్లాలి. లేదంటే బ్యాంకులు, పోస్టాఫీసులు..ఇలా రోజుల తరబడి ఇబ్బందులు పడాల్సిందే. పోనీ దిగిన వెంటనే ఆధార్ కార్డు వస్తుందా అంటే అదీ నమ్మకం లేదు.
కార్డు వచ్చేసరికి కనీసం 15 రోజులు లేదా నెల రోజులు పడుతుంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి జనం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటి వద్దకే ఆధార్ సేవలు(Aadhaar Services) అందించేందుకు నిర్ణయించింది. దీని వల్ల సమయంతో పాటు ఆఫీసుకు వెళ్లే కష్టం తప్పుతుంది.
త్వరలోనే ఈ సేవలను అందించనుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను దేశంలోని భారత తపాలా చెల్లింపు బ్యాంకు కు చెందిన 48 వేల మంది పోస్ట్ మ్యాన్లకు శిక్షణ అందించనుంది.
ఆధార్ లో ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ అనుసంధానం, వివరాల అప్ డేట్ , చిన్న పిల్లలకు ఆధార్ నమోదు వంటి సేవలు ఇక నుంచి ఇంటి వద్దకే చేర్చేలా చేస్తోంది.
దేశంలోని 755 జిల్లాల్లో జిల్లాకో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
Also Read : కనిష్ట స్థాయికి పడి పోయిన ఎల్ఐసీ షేర్లు