Aaditya Thackeray : ప్ర‌జా చైత‌న్యం ప్ర‌భుత్వంపై యుద్ధం

దూకుడు పెంచిన ఆదిత్యా ఠాక్రే

Aaditya Thackeray : శివ‌సేన మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కూలి పోయిన త‌ర్వాత మ‌రింత దూకుడు పెంచాడు మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న‌యుడు ఆదిత్యా ఠాక్రే. తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు ఆయ‌న రోడ్డెక్కారు.

గ‌త ఒక‌న్నిర నెల‌లుగా ముంబై లోని వ‌ర్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆదిత్యా ఠాక్రే కు 32 ఏళ్లు. ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా, సాధార‌ణంగా ఉంటూ వ‌చ్చారు.

కానీ రాను రాను త‌న స్వ‌రాన్ని మ‌రింత పెంచారు. షిండే ఎలా త‌మ పార్టీని మోసం చేశారో, ఎలా బీజేపీ త‌మ‌ను ఇబ్బంది పెట్టిందో ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray) ఎక్క‌డికి వెళ్లినా జ‌నం ఆదరిస్తున్నారు. ఆయ‌న నిష్ట యాత్ర‌, శివ సంవాద్ ప్ర‌చారాల ద్వారా కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ ప‌రుస్తున్నారు.

శివ‌సేన పార్టీ నుంచి క్యాడ‌ర్ వెళ్ల‌కుండా, నిరుత్సాహ ప‌డ‌కుండా ఉండేందుకు ఆదిత్యా జ‌నంలోకి వెళ్లడ‌మే బెట‌ర్ అని భావించాడు. ఆ దిశ‌గా ప్లాన్ చేశాడు. రంగంలోకి దిగాడు.

త‌న తండ్రి నేతృత్వం లోని పార్టీ వ‌ర్గం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనిని గ‌మ‌నించాడు జూనియ‌ర్ ఠాక్రే. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

ప్ర‌ధానంగా పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌చారం చేప‌ట్ట‌డం విశేషం. మంత్రిగా కూడా ప‌ని చేశారు.

కానీ ఇప్పుడు ఆయ‌న వేష‌ధార‌ణ కూడా మార్చేశారు. పూర్తిగా శివ‌సేన సైనికుడిగా మారారు ఉద్ద‌వ్ ఠాక్రే. నుదుట‌న ఎర్ర‌టి తిల‌కం ఇప్పుడు ఆయ‌న‌కు ఆభ‌ర‌ణంగా మారింది. అదే అత‌డిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిల‌బెట్టేలా చేసింది.

Also Read : త్వ‌ర‌లోనే శాఖ‌ల కేటాయింపు – ఫ‌డ్న‌వీస్

Leave A Reply

Your Email Id will not be published!