AAP MPs : పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 117 సీట్లలో 92 సీట్లు కైవసం చేసుకుని పవర్ లోకి వచ్చింది. దీంతో గతంలో మూడు సీట్లు ఉండగా ఇప్పుడు మరో ఐదు సీట్లు పెరిగాయి.
దీంతో రాజ్యసభ సభ్యులుగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. ఈనెల 31 వరకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.
కాగా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం, ఏ ఒక్కరు అప్లై చేసుకోక పోవడంతో ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇవాళ అధికారికంగా డిక్లేర్ చేశారు.
మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ , రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్ , ఐఐటీ – ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్ , పారిశ్రామిక వేత్త సంజీవ్ అరోరాను తమ అభ్యర్థులుగా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP MPs) నామినేట్ చేసింది.
ఆప్ మినహా ఇతర పార్టీలు ఏ ఒక్క అభ్యర్థిని నామినేట్ చేయక పోవడంతో అభ్యర్థుల ఎంపిక సాఫీగా కొనసాగింది. దీంతో వారి ఎంపిక లాంఛనంగా ముగిసిందని ఎగువ సభకు ఐదుగురు అభ్యర్థులు ఆప్ (AAP MPs)తరపున ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సురీందర్ పాల్ తెలిపారు.
రాఘవ్ చద్దా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉండగా ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా పని చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఘన విజయంలో చద్దా కీలక పాత్ర పోషించారు..
Also Read : గవర్నర్ ఆరోపణలపై స్పందించిన సర్కార్