AAP Co Ordinator’s : 12 జోన్ల‌కు ఆప్ నేత‌ల నియామ‌కం

కౌన్సిల‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం కోసం

AAP Co Ordinator’s : ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజ‌యాన్ని సాధించింది. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంచ‌నాలు మించి ప్ర‌జ‌లు ఆప్ కు ప‌ట్టం క‌ట్టారు. మొత్తం 250 వార్డుల‌కు గాను 1,300 మంది పోటీ చేశారు.

104 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది బీజేపీ. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 134 సీట్ల‌ను కైవ‌సం చేసుకుని మెజారిటీ సాధించింది. మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంది. అయితే బీజేపీ త‌మ వారిని ప్ర‌లోభాల‌కు గురి చేస్తోందంటూ ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందంటూ మండిప‌డ్డారు ఆప్ చీఫ్‌, సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఇదిలా ఉండ‌గా త‌మ వారిని కాపాడుకునేందుకు, బీజేపీ ట్రాప్ లో ప‌డ‌కుండా ఉండేందుకు ఇప్ప‌టి నుంచే సీఎం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. ఈ మేర‌కు ఢిల్లీలోని 12 జోన్ల‌లో కౌన్సిలర్ల‌తో స‌మన్వ‌యం చేసుకునేందుకు ఆప్(AAP Co Ordinator’s) న‌లుగురు నాయ‌కుల‌ను నియ‌మించింది. ఈ న‌లుగురు ముఖ్య నేత‌లు త‌మ కౌన్సిల‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటార‌ని ఆప్ వెల్ల‌డించింది.

స‌మావేశాలు నిర్వ‌హించి, వారి ప్రాంతాల‌ను సంద‌ర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుంటార‌ని పేర్కొంది ఆప్. ఒక్కో నాయ‌కుడికి మూడు జోన్లు అప్ప‌గించిన‌ట్లు తెలిపింది. ఆదిల్ ఖాన్ సివిల్ లైన్స్ , రోహిణి , న‌జ‌ఫ్ గ‌డ్ ల‌కు ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.

సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ న‌రేలా, కేశ‌వ‌పురం, వెస్ట్ జోన్ ల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. స‌ద‌ర్, క‌రోల్ బాగ్ , షాహ‌దారా నార్త్ ల బాధ్య‌త దుర్గేష్ పాఠ‌క్ పై ఉటుంద‌ని , సెంట్ర‌ల్ , సౌత్ , షాహ‌దారా సౌత్ ల బాధ్య‌త అతిషి చేప‌డ‌తార‌ని పేర్కొంది.

Also Read : టిప్పు సుల్తాన్ కాలం నాటి పేర్లు మార్పు

Leave A Reply

Your Email Id will not be published!