Manoj Tiwari : ఢిల్లీలో అల్లర్లకు ఆప్ కుట్ర – బీజేపీ
మత మార్పిడులకు ప్రయత్నం
Manoj Tiwari : భారతీయ జనతా పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో అల్లర్లు సృష్టించి లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. బౌద్ద మత కార్యక్రమంలో ఢిల్లీ ఆప్ మంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది బీజేపీ. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఆప్ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎంపీ(Manoj Tiwari) . మంత్రిని వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని, కేబినెట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఆప్ మంత్రి స్థాపించిన జై భీమ్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
బహిరంగ సామూహిక మత మార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొన్నారు. వేలాది మంది హిందూ దేవుళ్లను దూషిస్తూ ప్రమాణం చేయడం కీలకంగా మారింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
దమ్మ చక్ర ప్రవర్తన్ దిన్ అని పిలిచే సామూహిక మత మార్పిడి కార్యక్రమం అక్టోబర్ 1956లో లక్షలాది మంది అనుచరులతో కలిసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ద మతం స్వీకరించారు.
డాక్టర్ అంబేద్కర్ సామూహిక మత మార్పిడి కార్యక్రమాలలో పునరావృతమయ్యే హిందూ దేవుళ్లను దూషించడంతో సహా 22 ప్రమాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందితో పాటు ఆప్ మంత్రి నాకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులపై విశ్వాసం లేదన్నారు. వారిని తాను పూజించనని చెప్పారు.
ఆప్ మంత్రి పాల్గొనడాన్ని బీజేపీ ఖండించింది. ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని కించ పర్చడం తప్ప మరొకటి కాదని పేర్కొంది.
Also Read : జిన్ పింగ్ ను చూసి మోదీ జంకుతున్నారా