Simranjit Singh Mann : భ‌గ‌త్ సింగ్ పై నోరు పారేసుకున్న ఎంపీ

సిమ్రంజిత్ సింగ్ మాన్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Simranjit Singh Mann : శిరోమ‌ణి అకాలీద‌ళ్ (అమృత్ స‌ర్ ) పార్టీకి చెందిన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ నియోజ‌క‌వ‌ర్గానికి సంగ్రూర్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్(Simranjit Singh Mann) నోరు పారేసుకున్నారు.

భార‌త దేశ స్వాతంత్ర యోధుడు, ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ ను ఓ టెర్ర‌రిస్ట్ అంటూ కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేగింది. కోట్లాది మంది భార‌తీయుల‌కు, యువ‌తీ యువ‌కుల‌కు ఆయ‌న ఆరాధ్య దైవం.

భ‌గ‌త్ సింగ్ ఒక యువ ఆంగ్ల నౌకాద‌ళ అధికారిని చంపాడు. అత‌ను అమృత‌ధారి సిక్కు కానిస్టేబుల్ చ‌న్న‌న్ సింగ్ ను చంపాడు. ఆ స‌మ‌యంలో జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరాడు.

ఇప్పుడు మీరు చెప్పండి భ‌గ‌త్ సింగ్ ఉగ్ర‌వాది అవునా కాదా అంటూ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌భుత్వంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తో పాటు ఇత‌ర పార్టీలు, మేధావులు, క‌ళాకారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు సంగ్రూర్ ఎంపీపై నిప్పులు చెరిగారు.

త‌న య‌వ్వ‌నాన్ని, త‌న విలువైన జీవితాన్ని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిని ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిల‌దీశారు.

స్వాతంత్ర స‌మ‌ర యోధుడిని అగౌర‌వ ప‌రిచేలా , మ‌నో భావాలు దెబ్బ తీసేలా కామెంట్ చేసిన ఎంపీ వెంట‌నే పంజాబ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ రాఘ‌వ చ‌ద్దా.

ఎవ‌రూ ఎంపీ మాట‌ల్ని క్ష‌మించ‌ర‌ని పేర్కొన్నాడు. ఈ బాధ్యతా రాహిత్య వ్యాఖ‌ల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ష‌హీద్ ఏ ఆజం భ‌గ‌త్ సింగ్ ఒక వీర‌డు.

దేశ భ‌క్తుడు. విప్లవ కారుడు. నిజ‌మైన నేల పుత్రుడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని అన్నారు.

Also Read : పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ధ‌ర్నాలు బంద్

Leave A Reply

Your Email Id will not be published!