LG Saxena : దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలకు గవర్నర్లు, లెఫ్లినెంట్ గవర్నర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో(LG Saxena) నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఎల్జీ తన పరమితికి మించి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది ఆప్.
చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడంటూ మండిపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ కావాలని తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ఎల్జీ సక్సేనాను అడ్డం పెట్టుకుని ఇరికించే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడింది. వినయ్ కుమార్ సక్సేనా తన కుర్చీ పరువును దిగజార్చుతున్నారంటూ ఎద్దేవా చేసింది ఆప్. ఈ సందర్భంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పందించారు.
తమకు ఎలా పాలన చేయాలో నేర్పించేంత సీన్ , అనుభవం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదన్నారు. ఇదిలా ఉండగా ఎల్జీ సక్సేనా సీఎంను పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది ఆప్.
అరవింద్ కేజ్రీవాల్ తమ లాగా నామినేటెడ్ అయిన వ్యక్తి కాదని పేర్కొంది. సీఎం వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారని ఇది ఆయన పనితీరుకు నిదర్శనమని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.
సీఎంను పదే పదే విమర్శించడం మాను కోవాలని సూచించింది ఆప్. ఇంకోసారి దిగజారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తన పరిధిలో తను ఉంటే మంచిదని హితవు పలికింది ఆప్.
Also Read : మోసం..నమ్మక ద్రోహం కేజ్రీవాల్ నైజం