Akshay Marathe : పంజాబ్ లో అఖండ విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లలో చాప కింద నీరులా విస్తరించాలని యోచిస్తోంది.
పంజాబ్ ప్రజలు ఇచ్చిన గెలుపు కిక్కు ను ఇతర రాష్ట్రాలలో వర్కవుట్ అయ్యేలా చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆప్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసింది.
ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అక్షయ్ మరాఠే(Akshay Marathe) వెల్లడించారు. పంజాబ్ లో ఎన్నికల ఫలితాల అనంతరం ఆప్ సుదీర్ఘ సమీక్ష జరిపింది. కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది.
ఇదే సమయంలో ప్రధానంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కీలకంగా మారాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నాయకులు కీలక భేటీ అయ్యారు.
విజయ గర్వంతో ఊగి పోరాదని మన పార్టీ కేవలం సామాన్యులకేనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ప్రజలు ఇవాళ కాక పోయినా రేపటికైనా ఆప్ కు పట్టం కడతారని ఆ పార్టీ చీఫ్ నమ్ముతున్నారు.
ఇదే స్ట్రాటజీతో తాము ఆ రెండు రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్నామని మరాఠే వెల్లడించారు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ పుంజు కోవడం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : 2024 ఎన్నికల్లోనూ మాదే అధికారం