Arvind Kejriwal : యూపీలో ఆప్ ఫోకస్ – కేజ్రీవాల్
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే ఎన్నికల్లో ఆప్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తమను మొదట అన్ని పార్టీలు తక్కువ అంచనా వేశాయని కానీ ఆ తర్వాత పార్టీని గుర్తించడం మొదలు పెట్టాయని అన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ తో కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీని కైవసం చేసుకున్నాం. కానీ కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా సర్వోన్నత న్యాయ స్థానం ఆప్ వైపు మొగ్గు చూపింది. కేంద్రానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలు లేవని స్పష్టం చేసింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు అరవింద్ కేజ్రీవాల్. కానీ కావాలని కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు రావాలని ప్రయత్నం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దీనిని ప్రతిపక్షాలన్నీ కలిసి రాజ్యసభలో కేంద్రం ఆర్డినెన్స్ ను రాకుండా అడ్డుకుంటామని చెప్పారు కేజ్రీవాల్. యూపీలో ఆప్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల సత్తా చాటిందని, ఇప్పటికే ఢిల్లీలో జెండా ఎగుర వేసిన తాము పంజాబ్ లో సత్తా చాటామని యూపీలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు సీఎం.
Also Read : Chiranjeevi Raj