AAP Win MCD Election : ఆప్ విజ‌యం అంత‌టా సంబురం

ఢిల్లీ న‌గ‌ర పాల‌క ఎన్నిక‌ల్లో హ‌వా

AAP Win MCD Election : ఢిల్లీ న‌గ‌ర పాలిక ఎన్నిక‌ల ఫ‌లితాలలో ఆప్ కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీకి . ఆ పార్టీ ఎంసీడీలో గ‌త 15 ఏళ్లుగా ప‌ట్టు నిలుపుకుంటూ వ‌స్తోంది. ఈసారి ఎలాగైనా స‌రే మ‌రోసారి స‌త్తా చాటాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేసింది బీజేపీ. కానీ ఆశించిన మేర దేశ రాజ‌ధాని వాసుల మ‌న‌సు గెలుచుకోలేక పోయింది.

మొత్తం 250 స్థానాల‌కు గాను 1,300 మంది పోటీలో ఉన్నారు. ఈసారి కొత్త‌గా ఎంఐఎం పార్టీ కూడా బ‌రిలో నిలిచింది. కానీ బోణీ కొట్ట‌లేక పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే ప‌రిమిత‌మైంది. ఇక ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP Win MCD Election) చేతిలోకి వెళ్లి పోయింది.

ఎలాగైనా స‌రే ఆప్ ను అడ్ర‌స్ లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేసిన బీజేపీకి ఇది పెద్ద దెబ్బ‌. అయినా ఆ పార్టీకి గ‌ణ‌నీయ‌మైన సీట్లు వ‌చ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఆప్ కు 150 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని అంచ‌నా వేశాయి. కానీ ఆ పార్టీకి కేవ‌లం 135 సీట్ల వ‌ద్ద‌నే ఆగి పోయింది. మ‌రో వైపు బీజేపీకి 105 సీట్లు వ‌చ్చాయి.

చివ‌రి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది. ఈ త‌రుణంలో ఆప్ ఇక మేయ‌ర్ ప‌ద‌వి ఖాయం కావ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్య‌క్తం అవుతోంది. పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగి పోయారు. ఢిల్లీ న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ఆప్ కు జై అంటూ నినాదాలు మారుమ్రోగుతున్నాయి.

అంత‌టా ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఫోటోలు, పోస్ట‌ర్ల‌తో నిండి పోయాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ ప‌నితీరుకు ప‌ట్టం క‌ట్టార‌ని స్ప‌ష్టం చేశారు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్‌.

Also Read : ఢిల్లీ బ‌ల్దియాపై ఆప్ దే జెండా

Leave A Reply

Your Email Id will not be published!