Raghav Chadha : తమిళనాడు గవర్నర్ పై చద్దా ఫైర్
సెంథిల్ బాలాజీ ఎలా అనర్హుడు
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఎలా మంత్రి పదవికి అర్హుడు కాదో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ బీజేపీయేతర ప్రభుత్వాలను కావాలని టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేబినెట్ కు సీఎం కెప్టెన్ అని, ఎవరిని కంటిన్యూ చేయాలో ఎవరిని తీసుకోకూడదో, ఎవరికి ఏయే శాఖలు కేటాయించాలనేది పవర్స్ అన్నీ అతడికి మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. కానీ ఈ విషయం తెలుసు కోకుండా గవర్నర్ ఒంటెద్దు పోకడలు పోవడం దారుణమన్నారు.
దీనిని తమ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు రాఘవ్ చద్దా(Raghav Chadha). మంత్రి వర్గాన్ని ఎన్నుకునే అధికారం సీఎంకు ఉందని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పదే పదే సీఎంకు అడ్డుపుల్ల వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Muruga Math Seer CM : సీఎంను కలిసిన మురుగ మఠాధిపతి