Sanjay Singh : మోదీ అదానీ బంధం బయట పెట్టాలి
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్
AAP Sanjay Singh : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేంద్రం యత్నిస్తోందన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఆప్ , డీఎంకే, టీఎంసీ, సీపీఐ, సీపీఎం , బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ నుండి విజయ్ చౌక్ వరకు భారీ నిరసన చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ప్ల కార్డులతో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ముందు గౌతం అదానీకి ప్రధానమంత్రి మోదీకి మధ్య ఉన్న బంధం ఏమిటో బయట పెట్టాలని ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ సంజయ్ సింగ్(AAP Sanjay Singh).
ఆయన సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. కావాలని బీజేపీయేతర రాష్ట్రాలను, ఎంపీలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆధారాలు లేక పోయినా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న వాళ్లపై ఎందుకు దాడులు జరగడం లేదంటూ ప్రశ్నించారు ఎంపీ సంజయ్ సింగ్. దేశంలో రాచరిక పాలన సాగుతోందని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో ఒక రోజు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ అంతం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తాము దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ రావు, కేశవరావు, సుప్రియా సూలే , ఖర్గే , ఇతర పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు.
ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీకి జేబు సంస్థలుగా మారాయంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.
Also Read : మోదీ సర్కార్ పై ఎంపీల నిరసన