Sanjay Singh : అగ్నిపథ్ ను నిరసిస్తూ మోదీకి రూ. 420
పంపిస్తామన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
Sanjay Singh : దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై ఇంకా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) వెల్లడించారు.
ఈ మేరకు తాము రూ. 420 చొప్పున పంపిస్తామన్నారు. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. దేశాన్ని రక్షించేందుకు డబ్బు కోసం ఏడవ వద్దని ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు.
ఒక్కో ఆప్ కు చెందిన ప్రజాప్రతినిధులు మోదీకి పంపిస్తారని ప్రకటించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆప్ తన ఆందోళనలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ రూ. 420 రూపాయలను ప్రధానమంత్రికి చెక్కుల రూపంలో లేదా డీడీల రూపంలో పంపిస్తామన్నారు సంజయ్ సింగ్. ఈ సంఖ్య చార్ సౌ బీస్ అని అర్థమన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్లను ఇలా కాంట్రాక్టు పేరుతో అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు ఆప్ ఎంపీ.
సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి ప్రధాన మంత్రి మోదీ అబద్దాలు ఆడుతున్నారని, డబ్బుల కొరత ఉందంటూ మాయ మాటలు చెబుతున్నాడని ఆరోపించారు.
ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్న మోదీకి కనువిప్పు కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లక్నో లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సంజయ్ సింగ్.
యూపీ అంతటా మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా యువజన , విద్యార్థి విభాగాల సభ్యులు విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
కొందరు ఆప్ నేతలపై ఈడీ దాడులు చేయడాన్ని తప్పు పట్టారు. ఈడీ బీజేపీకి కీలు బొమ్మగా మారిందన్నారు.
Also Read : టైలర్ కిల్లర్స్ పై కోర్టు ఆవరణలో దాడి