AAP Protest Sisodia Arrest : సిసోడియా అరెస్ట్ పై ఆప్ ఆందోళన
కావాలని కేంద్రం నిర్వాకమేనని ఆరోపణ
AAP Protest Sisodia Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆప్ లో నెంబర్ 2 గా పేరు పొందిన మనీష్ సిసోడియా ను కేంద్ర దర్యాప్తు సంస్థ 8 గంటల పాటు విచారణ చేపట్టింది. ఎలాంటి సమాధానాలు ఇవ్వక పోవడంతో అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
ఈ మొత్తం వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం(AAP Protest Sisodia Arrest) వ్యక్తం చేసింది. కేంద్రం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు ఎంపీ సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సోమవారం ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చింది.
ఇవాళ ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలని ఆప్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు(AAP Protest) పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే సీబీఐ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆప్ శ్రేణులు చేరుకున్నాయి. సిసోడియాను కావాలని ఇరుకున పెట్టేందుకే ఇలా చేశారంటూ ఆరోపించారు. సీబీఐ ఆధారాలు లేని ఆరోపణలు చేసిందంటూ ఆప్ ఫైర్ అయ్యింది.
రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక మోదీ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని మండి పడ్డారు అరవింద్ కేజ్రీవాల్, మాన్ , సంజయ్ సింగ్ . సిసోడియాను విడుదల చేసేంత దాకా తమ ఆందోళన కొనసాగుతుందని ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ స్పష్టం చేశారు.
Also Read : కేంద్రం చిల్లర రాజకీయం – సంజయ్