AAP Slams CM : ఈ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారని మండిపడింది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP). ఇప్పటికే మణిపూర్ మండుతోంది. నిత్యం ఘటనలు, అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇప్పటి వరకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది చని పోయారు. మరికొందరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. లెక్కకు మించిన జనం పునరావాస శిబిరాలలో తలదాచు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఆప్.
AAP Slams CM Assam
ఇదే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చొరబాట్లు ఎక్కువై పోయాయని ఆందోళన చెందడం విడ్డూరంగా ఉందని ఆప్ ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఆర్మీ, పోలీస్ వ్యవస్థలపై బీజేపీ సర్కార్ నియంత్రణ కోల్పోయిందా అని నిలదీసింది. రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఇక దేశ సరిహద్దుల్లో ఎలా కాపలా కాస్తారంటూ ప్రశ్నించింది.
మోడీ పాలనలో దేశానికి సంబంధించిన సరిహద్దులు సురక్షితంగా లేవన్నది అస్సాం సీఎం ఆందోళనతో రూఢీ అయ్యిందని పేర్కొంది. ఇకనైనా సీఎం మేలుకుంటే బెటర్. లేక పోతే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
Also Read : UP BIHAR AP TOP : పిల్లల అక్రమ రవాణాలో యూపీ..బీహార్..ఏపీ