AAP Support : ఆర్డినెన్స్ కు మ‌ద్ద‌తిస్తే క‌లుస్తాం

కీలక ప్ర‌క‌ట‌న చేసిన కేజ్రీవాల్

AAP Support : బెంగ‌ళూరు వేదిక‌గా ప్ర‌తిప‌క్షాల స‌మావేశం జూలై 17,18న జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే 24 పార్టీల‌ను ఆహ్వానించారు. ఇందులో ఆప్ కూడా ఉంది. ఇదిలా ఉండ‌గా కేంద్రం త‌మ‌పై క‌క్ష క‌ట్టి జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మెలిక పెట్టారు. లేక పోతే తాము హాజ‌రు కాబోమంటూ స్ప‌ష్టం చేశారు కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో ఆప్ క‌న్వీన‌ర్ తాము హాజ‌రు కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న జాతీయ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడే వ్యూహంపై నిర్ణ‌యం తీసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) బెంగ‌ళూరులో జ‌రిగే కీల‌క భేటీకి ఓకే చెప్ప‌డం విశేషం. ఆప్ త‌న కీల‌క రాజ‌కీయ క‌మిటీ స‌మావేశం త‌ర్వాత , ఢిల్లీ బ్యూరోక్ర‌సీపై తిరిగి నియంత్ర‌ణ‌ను చేజిక్కించుకున్న వివాదాస్ప‌ద కేంద్ర ఉత్త‌ర్వుకు వ్య‌తిరేకంగా ఆప్ ప్ర‌చారానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా కేంద్రం తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా దేశానికి వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా. త‌మ వాయిస్ కు టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీ, ఎస్పీ , శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీలు సైతం మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని తెలిపారు.

Also Read : INDW vs BANW ODI : బంగ్లా చేతిలో భార‌త్ చిత్తు

Leave A Reply

Your Email Id will not be published!