Vijay Nair : ఈడీ క‌స్ట‌డీకి ‘ఆప్’ విజ‌య్ నాయ‌ర్

ఇప్ప‌టికే బోయిన‌ప‌ల్లి అభిషేక్ అరెస్ట్

Vijay Nair : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం దేశంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు క‌విత పేరు ప్ర‌ధానంగా వినిపించింది. ఏమైందో ఏమో కానీ అంత‌లోనే ఆమె పేరు రాకుండా పోయింది. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టేన‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ ఉంది.

తాజాగా మ‌ద్యం స్కాం కేసులో కీల‌కంగా ఉన్న ఆప్ క‌మ్యూనికేష‌న్ ఇన్ చార్జి విజ‌య్ నాయ‌క‌ర్(Vijay Nair)  ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ సెర్చ్ ఆప‌రేష‌న్ ను ప్రారంభించింది. ఎక్సైజ్ పాల‌సీ కేసులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ సంద‌ర్భంగా విజ‌య్ నాయ‌ర్ ను గ‌తంలో సీబీఐ అరెస్ట్ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ దుమారం రేగ‌డంతో విచార‌ణ ముమ్మ‌రం చేసింది. నాయ‌ర్ తో పాటు ఆర్థిక మోసాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీ వ్యాపార‌వేత్త అభిషేక్ బోయిన్ ప‌ల్లిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అత‌డిని ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఈ ఇద్ద‌రు గ‌నుక అప్రూవ‌ర్స్ గా మారితే లిక్క‌ర్ స్కాంలో కీల‌క పాత్రధారులు ఎవ‌రు అన్న‌ది తేలుతుంది.

జూలైలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా చేసిన సిఫార‌సు మేర‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ను విచారించింది సీబీఐ, ఈడీ. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిపై అభియోగాలు మోపింది. ఇదిలా ఉండ‌గా విజ‌య్ నాయ‌ర్(Vijay Nair)  ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల‌కు క‌మ్యూనిషేన్ ఇన్ చార్జీగా ఉన్నారు.

ఎందుకు అరెస్ట్ చేశారో తెలియ‌డం లేదంటూ ఆరోపించింది ఆప్.

Also Read : గ‌న్ క‌ల్చ‌ర్ పై సీఎం ఉక్కు పాదం

Leave A Reply

Your Email Id will not be published!