Atishi Saurabh Sworn : మంత్రులుగా అతిషి..సౌరభ్ ప్రమాణం
మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రిజైన్
Atishi Saurabh Sworn : ఢిల్లీ క్యాబినెట్ లో నూతన మంత్రులుగా కొలువు తీరారు అతిషి, సౌరభ్ భరద్వాజ్. గురువారం వారితో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం(Atishi Saurabh Sworn) చేయించారు. మనీ లాండరింగ్ కేసులో గతంలో మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఆయనను తీహార్ జైలుకు పంపించింది కోర్టు. దీంతో అటు సత్యేంద్ర జైన్ తో పాటు మనీష్ సిసోడియా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ ఖాళీ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కు చెందిన ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లకు మంత్రులుగా కేటాయించారు.
ఢిల్లీ ప్రభుత్వంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేజ్రీవాల్ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు సౌరభ్ భరద్వాజ్ , కల్కాజీ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నరు అతిషి. ఇప్పుడు వీరిద్దరూ కేబినెట్ లో కొలువు తీరడంతో ఆప్ లో సంతోషకర వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా సీఎం ఇద్దరు మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. అతిషికి(Atishi) విద్య, పంచాయతీరాజ్ , విద్యుత్ , పర్యాటక శాఖలు కేటాయించారు సీఎం. ఇక సౌరభ్ భరద్వాజ్ కు ఆరోగ్యం, పట్టణాభివృద్ది, నీరు, పరిశ్రమలు అప్పగించారు సీఎం కేజ్రీవాల్.
Also Read : రాహుల్ కామెంట్స్ చౌహాన్ సీరియస్