Bhagwant Mann : భారత రాజకీయాలలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. తాము ప్రకటించిన విధంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నిజమైన ప్రజలకు, సామాన్యులకు చెందిన పార్టీగా చాటుకుంది.
ఇవాళ ఏ పార్టీ ఊహించని రీతిలో దిమ్మ తిరిగేలా అన్ని పార్టీలకు షాక్ గురయ్యేలా అఖండ విజయాన్ని నమోదు చేసింది.
117 సీట్లకు గాను ఏకంగా 92 సీట్లను సాధించి తనకు ఎదురే లేదని చాటింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధురి నియోజకవర్గం నుంచి
భారీ విజయాన్ని నమోదు చేసిన భగవంత్ మాన్(Bhagwant Mann) ప్రజలను ఉద్దేశించి సంచలన ప్రసంగం చేశారు.
ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ పుట్టిన నవాన్ షహర్ జిల్లాలోని ఖట్కర్కనల్ లో
తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. తాము రాజ్ భవన్ లో ప్రమాణం చేయడం లేదని చెప్పాడు.
తమకు ఓటు వేయలేదని ఎవరూ చింతాల్సిన పని లేదన్నాడు. తమ పార్టీ, ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం
పని చేస్తుందని వెల్లడించాడు భగవంత్ మాన్. తాను గెలుపొందిన ధురిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు మాన్.
అంతే కాకుండా మరో సంచలన ప్రకటన చేశాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆనవాయితీగా సీఎం ఫోటో ఉండదన్నారు.
భగవంత్ మాన్ 58 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సీఎం ఫోటోకు బదులు సర్దార్ భగత్ సింగ్ , డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నాడు.
మహిళల భద్రత, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని భగవంత్ మాన్ చెప్పాడు. ఒకే ఒక నెలలో పంజాబ్ లో మీరు ఊహించని మార్పు చూస్తారని ప్రకటించాడు.
Also Read : కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు దేశ భక్తుడు