MP Sanjay Singh : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై వేటు
ఇప్పటి వరకు 24 మంది ఎంపీలు
MP Sanjay Singh : పార్లమెంట్ లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. నిన్న జూలై 26న ఏకంగా రాజ్యసభలో 19 మంది ఎంపీలపై వేటు వేశారు.
ఇవాళ జూలై 27 బుధవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. దీంతో పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు సంబంధించి మొత్తం 24 మంది ఎంపీలపై వేటు వేశారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను వారం రోజుల పాటు రాకుండా సస్పెన్షన్ విధించారు. కాగితాలను చించి కుర్చీపై వేసినందుకు 256 నియమం కింద అతడిపై చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరి శంశ్ ప్రకటించారు.
దీనిని వికృత ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం 3.42 గంటలకు జరిగింది.
సంజయ్ సింగ్ తో పాటు మరికొందరు సభ్యులు గుజరాత్ లోని బొటాడా జిల్లాలో కల్తీ లేదా విష పూరితమైన మద్యం సేవించడం వల్ల 28
మంది చని పోయారని ఈ విషయంపై కేంద్ర సర్కార్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంయమనం పాటించాలని
స్పీకర్ కోరినా పట్టించుకోలేదు.
కాగితాలను చించి కుర్చీలపై విసిరి వేశారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). తాను ఇప్పటికీ సభలోనే
ఉన్నానని విషపు మద్యం కారణంగా 28 మంది చని పోలేదని ఇప్పటి దాకా 55 మంది ప్రాణాలు కోల్పోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తనను సస్పెండ్ చేసి ఉండవచ్చు. కానీ చని పోయిన వారి ఆత్మలు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయన్నారు సంజయ్ సింగ్.
Also Read : ఇంటిని మినీ బ్యాంక్ గా వాడుకున్నారు