Abhaya Hastam : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోజుకు 18 గంటల పాటు పని చేయాలని కోరారు. ఒకవేళ ఇష్టం లేక పోతే స్వచ్చంధంగా తప్పు కోవచ్చంటూ కుండ బద్దలు కొట్టారు.
Abhaya Hastam from 28th
సంతకం చేసిన తొలి రోజు నుంచే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడ్డారు సీఎం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది.
డిసెంబర్ 28న ప్రజా పాలన కార్యక్రమం మొదలు పెట్టనుంది. ఈ అభయ హస్తం కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.
అభయ హస్తం కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాల లబ్ది పొందేందుకు గాను ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Also Read : Amit Shah : 28న అమిత్ చంద్ర షా రాక