పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ సారథ్యంలో జోనో సంజోగ్ యాత్రను ప్రారంభించారు. త్వరలో జరగనున్న గ్రామీణ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసింది అధికారంంలో ఉన్న టీఎంసీ.
ఈ ప్రచార యాత్ర 60 రోజుల పాటు కొనసాగుతుంది ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ 3,500 కిలోమీటర్ల మేర కారవాన్ లో ప్రయాణం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 కంటే ఎక్కువ ర్యాలీలు చేపట్టనున్నారు. యాత్ర వెనుక ఉన్న ఉద్దేశం గురించి వివరించారు బెనర్జీ. ప్రజానీకంతో నిత్యం సంబంధం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే సంజోగ్ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. పార్టీ సంకల్ప బలాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఔట్ రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఎంపీ.
దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలియ చేయడం జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కూచ్ బెహార్ కు వచ్చారు అబిషేక్ బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలను కవర్ చేశాక యాత్ర దక్షిణ జిల్లా కాక్ ద్వీప్ లో ముగుస్తుంది. ప్రతి రాత్రి పార్టీ జిల్లా స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రజల అభిప్రాయాలను, సూచనలను స్వీకరించనున్నట్లు చెప్పారు అభిషేక్ బెనర్జీ.