GN Saibaba : సాయిబాబాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
బాంబే హైకోర్టు విడుదల తీర్పు సస్పెండ్
GN Saibaba : మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన నిర్దోషి అని , వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వం తరపున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దాఖలు చేసిన దావాపై అత్యవసరంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శనివారం కీలక తీర్పు చెప్పింది కోర్టు. సాయిబాబాను(GN Saibaba) నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది.
ఆయన జైలు లోనే కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నిందితులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం. ఈ అంశాన్ని డిసెంబర్ 8న విచారణకు లిస్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఎనిమిది ఏళ్ల కిందట మావోయిస్టుల సాయంతో దేశంపై యుద్దం చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు దివ్యాంగుల విద్యావేత్త జీఎన్ సాయిబాబ.
ఆయనను నిర్దోషిగా ప్రకటించింది బాంబే హైకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఎలాంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొంది ధర్మాసనం. ఆయనపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశామని , ఈ తరుణంలో విడుదల చేయడం మంచిది కాదని పిటిషన్ లో పేర్కొంది.
ఇదిలా ఉండగా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్ , హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం మొదట పిటిషన్ ను తిరస్కరించింది.
Also Read : ఓబీసీ హోదాను తారు మారు చేసిన మోదీ