ACB Arrest PS : ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
శంషాబాద్ మాజీ పంచాయతీ సెక్రటరీ
ACB Arrest PS : తెలంగాణలో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మాజీ పంచాయతీ సెక్రటరీ గా పని చేసిన దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్(ACB Arrest PS) చేసింది. ఈ మేరకు సురేందర్ రెడ్డిని ఏసీబీ ఆఫీసుకు తరలించారు.
అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేపట్టారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తారు. ఇదిలా సురేందర్ రెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.
కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని, అక్రమ ఆస్తులకు లెక్కా పత్రం లేకుండా పోయిందని విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో తన బంధువుల పేరుతో కూడా ఆస్తులు, నగదు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.
పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు గురువారం రంగంలోకి దిగింది. సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు.
ఈ సోదాలలో ఈ మాజీ పంచాయతీ సెక్రటరీ నివాసంలో భారీగా ఆస్తులు, నగలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన వాటిలో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్లలో 120.2 తులాల పసిడి తో పాటు సిటీలో నాలుగు ఖరీదైన ప్లాట్లు, కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
2 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఉర్తించారు ఏసీబీ అధికారులు. నగదు, బంగారంతో పాటు ఆయా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
వెంటనే సురేంద్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కార్యాలయాలనికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి బహిరంగ మార్కెట్ విలువ రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.
Also Read : కేటీఆర్ నీ తండ్రి చరిత్ర తెలుసుకో