R Kama Raj Raids : మాజీ మంత్రి కామ‌రాజ్ కు విజిలెన్స్ షాక్

మంత్రితో పాటు స‌హ‌చ‌రుల ఇళ్ల‌పై దాడులు

R Kama Raj Raids : త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి ఆర్. కామ‌రాజ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు చెందిన 49 స్థ‌లాల‌పై విజిలెన్స్ బృందాలు చేశాయి.

చెన్నై లోని ఆరు చోట్ల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల‌లో సోదాలు చేప‌ట్టారు. దీనిని నిరసిస్తూ అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు గుమిగూడారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

విజిలెన్స్ , యాంటీ క‌ర‌ప్ష‌న్ డైరెక్ట‌రేట్ (డీవీఎసీ) శుక్ర‌వారం చెన్నై లోని మాజీ ఆహార శాఖ మంత్రి ఆర్. కామ‌రాజ్(R Kama Raj Raids), ఆయ‌న స‌హ‌చ‌రుల‌కు చెందిన 49 ప్రాంతాల‌లో దాడులు చేప‌ట్టింది.

పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2015 నుండి 2021 మ‌ధ్య కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు తేలింది.

దాదాపు రూ. 58.44 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోపించింది. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని చేర్చింది. వారిలో ఆర్. కామ‌రాజ్ డాక్ట‌ర్లు అయిన కుమారులు ఉన్నారు.

32 ఏళ్ల డాక్ట‌ర్ ఎం.కె. ఎనియ‌న్ , 30 ఏళ్లున్న డాక్ట‌ర్ కె. ఇన్ఫాన్ ఉన్నారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు లోని న‌న్నిలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మ‌ల్యేగా ఉన్నారు ఆర్. కామ‌రాజ్ .

అన్నాడీఎంకే నుంచి దాడికి గురైన ఆరో మాజీ మంత్రి కావ‌డం విశేషం. ప్ర‌తిప‌క్ష నేత ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ఈ దాడుల‌ను ఖండించారు. డీఎంకే ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు.

అన్నా డీఎంకేను ఎదుర్కోలేక ఇలాంటి దాడుల‌కు ప్రేరేపిస్తున్నారంటూ సీఎం ఎంకే స్టాలిన్ పై మండిప‌డ్డారు. కానీ ప్ర‌జ‌లు అంతా చూస్తున్నార‌ని , త‌మ‌కు ఏదో ఒక రోజు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.

Also Read : సీఎం షిండేకు పెరుగుతున్న మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!